తేమ ఎక్కువగా ఉన్న వరి కోయరాదు..

వ్యవసాయ అధికారి సాయి కిరణ్…


వెల్గటూర్, అక్టోబర్ 25 (ఆంధ్ర‌ ప్రభ ) : హార్వెస్టర్ తో వరి కోసేటప్పుడు తేమ ఎక్కువగా వరి కోయకూడదని, ధాన్యం పొడిగా ఉన్నప్పుడే కోత కోయాలని మండల వ్యవసాయ అధికారి సాయి కిరణ్ (SaiKiran) అన్నారు.శనివారం రైతు వేదికలో మండల ఆర్వెస్టర్ ఓనర్ ల కు స్థానిక తహశీల్దార్ ఆర్ శేఖర్ తో కలిసి అవగహన కల్పించారు.ఈ సందర్భంగా సాయి కిరణ్ మాట్లాడుతూ.. వరి పొలం పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాత కోయడం వలన తాలు లేకుండా ఉంటుందని కోత మిషన్ ఉపయోగించే సమయంలో బ్లోయర్ తప్పనిసరిగా ఆన్ చేసి ఉంచాలని, కోత మిషన్ ఆర్ ఎం పి 19 నుంచి 20 కి పైగా ఉండాలని గేర్ స్నోట్ ఏ2 నుంచి బి1 లో పెట్టి వరి కోత కోయాలని సూచించారు.

కోత సమయంలో మిషన్ వేగం స్థిరంగా ఉండాలని వేగం ఎక్కువ లేదా తక్కువ మార్చకుడదన్నారు. మిషన్ లో క్లినర్ ఎప్పటికప్పుడు సీవ్ భాగాలను శుభ్రం చేయాలని కోత అనంతరం శుభ్రం చేసిన ధాన్యం నేరుగా బస్తాల్లో నింపి, నేల మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. ఈ జాగ్రత్తలు పాటించడం వలన ధాన్యం లో తాలు,మట్టిపెల్లలు, గడ్డి లేకుండా ఉత్తమ నాణ్యత గల ధాన్యం పొందవచ్చని వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐ రాం రెడ్డి,రెవెన్యూ అధికారి మహేష్,వ్యవసాయ విస్తరణ అధికారి మౌనిక తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply