నేలకొరిగిన వరి పంట
దండేపల్లి, అక్టోబర్ 25(ఆంధ్రప్రభ): దండేపల్లి మండలంలోని కొత్తమామిడి పల్లి గ్రామానికి చెందిన రైతు ఎంబడి సురేందర్ (Surender) 15 ఎకరాలు వరి పంట సాగు చేయగా వర్షంతో పంట నేలకొరిగింది. ఇంకో వారం రోజుల్లో కోత కోసేందుకు వచ్చిన వరిపంట ఒక్కసారిగా కురిసిన అకాల వర్షానికి కొంతమేరకు నేలకొరిగింది. చేతికొచ్చిన పంట అకాల వర్షంతో నేలకొరగడంతో రైతు కన్నీరు మున్నీరయ్యారు. అప్పు చేసి పంటలు సాగు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.

