Reward Mela | ప్రశంసా పత్రం స్వీకరణ…

Reward Mela | ప్రశంసా పత్రం స్వీకరణ…
Reward Mela | హసన్ పర్తి, ఆంధ్రప్రభ : వరంగల్ కమీషనరేట్ పరిధిలోని హసన్ పర్తి పోలీస్ స్టేషన్ టెక్ టీం(Tech team) కానిస్టేబుల్ సోమన్న, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి ప్రశంసా పత్రాన్ని స్వీకరించారు. పోలీస్ డిపార్ట్మెంట్ నందు ఆన్ లైన్ విభాగంలో ప్రతిభా పాటవాలు కనబరిచిన టెక్ టీం పోలీస్ అధికారులకు డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన మెగా రివార్డ్ మేలా(Reward Mela)లో అడిషనల్ డీజీపీ వివి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని కానిస్టేబుల్ సోమన్న అందుకున్నారు.
ఈమేరకు హాసన్ పర్తి సీఐ చేరాలు శాలువాతో సోమన్నను సన్మానించి అభినందించారు. రివార్డులతో మరింత బాధ్యతలు పెరుగుతాయని, ఆ మేరకు కృషి చేయాలని సోమన్నకు సూచించారు.
