పోలీస్ అధికారుల‌కు రివార్ట్…

పోలీస్ అధికారుల‌కు రివార్ట్…

సూర్యాపేట, ఆంధ్రప్రభ : స్టేషన్ హౌస్ ఆఫీసర్ పని విభాగాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ గత నెలలో కేసుల దర్యాప్తు, ఇన్వెస్టిగేషన్‌(Investigation)లో బాగా పని చేసిన కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ శివశంకర్‌ను సూర్యాపేట టూ టౌన్ ఎస్సై శివతేజను, అనంతగిరి ఎస్సై నవీన్ కుమార్‌లను ఎస్పి నరసింహ అభినందించి రివార్డ్ అందించారు.

జిల్లా పోలీస్ కార్యాలయం(Police Office)లో పోలీసు అధికారుల నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించి గత నెలలో జరిగిన నేరాల స్థితిగతులను సమీక్షించారు. అనంతరం కేసు దస్త్రాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు సలహాలు అందించారు. నేర నిరూపణలో సిబ్బంది సాంకేతిక సామర్థ్యం కలిగి ఉండాలని, పిర్యాదులపై త్వరగా స్పందించి సంఘటనా స్థలానికి త్వరగా చేసుకోవాలన్నారు.

రాత్రిళ్ళు పెట్రోలింగ్(Patrolling) పటిష్టంగా చేయాలని, కేసులు పెండింగ్ లేకుండా వేగంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. కేసుల్లో నేరస్తులకు త్వరగా శిక్షలు పడేలా పని చేయాలని పోక్సో(POCSO) కేసుల్లో, మహిళా సంభంద కేసుల్లో వేగంగా దర్యాప్తు చేసి కోర్టులతో సమన్వయంగా పని చేసి నేరస్తులకు శిక్షలు పడేలా కృషి చేయాలని సూచించారు. పోలీసు పని విభాగాల్లో సమర్థవంతంగా, వేగవంతమైన సేవలు అందించినప్పుడే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని అన్నారు.

ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దు, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఒక్క ప్రాణం కూడా పోకుండా సిబ్బంది పని చేయాలని ఈ సందర్భంగా దిశా నిర్దేశం చేశారు. నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ వాహన దారులను, ప్రజలను రోడ్డు భద్రత పట్ల అప్రమత్తం చేయాలని సూచించారు. నేరాల నివారణలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఎక్కువ మొత్తంలో సీసీటీవీ కెమెరాలు(CCTV Cameras) ఏర్పాటు చేసేలా ప్రజలను, వ్యాపారులను చైతన్యం చేయాలని పేర్కొన్నారు.

Leave a Reply