Review meeting | పనితీరు మెరుగుపరచాలి

Review meeting | సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు )మండలంలోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు తమ శాఖల పనితీరును మెరుగుపరచాలని సిర్పూర్ (యు) ఎంపీడీవో కృష్ణారావు కోరారు. ఇవాళ‌ ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగిరం చేయాలని, పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణ పనులు, సౌకర్యాలపై దృష్టి సారించాలని, గ్రామైక సంఘ భవనాల నిర్మాణ పనులు పరిశీలించాలని, ఇంటి పన్నులు వసూలు చేయాలని ఎంపీడీవో కోరారు. గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య పనులు మెరుగు పరచాలని, అంగన్వాడీ భవనాల్లో మరుగుదొడ్ల నిర్మాణ పనులు పరిశీలించాలని ఆయన కోరారు. ఉపాధి హామీ పథకం కూలీలకు సంబంధించిన కేవైసీలు చేయాలని ఎంపీడీవో కోరారు. తదితర విషయాలపై శాఖ‌ల వారిగా సమీక్షించారు. ఈ సమావేశంలో సిర్పూర్ యు ఎంపీ ఓ ప్రమోద్, ఐకెపిఎపిఎం కె రమేష్, ఈజీఎస్ ఏపిఓ కృష్ణయ్య, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply