Review | మూడేళ్లలో శభాష్ అనిపించుకుంటాం..

Review | మూడేళ్లలో శభాష్ అనిపించుకుంటాం..

ముగిసిన కాంగ్రెస్ హై కమాండ్ సమీక్ష
చర్చకు వచ్చిన రాజగోపాల్ రెడ్డి అంశం
త్వరలో రాజగోపాల్ రెడ్డితో చర్చిస్తామన్న హై కమాండ్
మున్సిపల్ ఎన్నికల ఫలితలపై సంతృప్తి చెందిన హై కమాండ్
ఆరు గ్యారంటీలు అమలు చేసి ఎన్నికలకు వెళ్తామని స్పష్టం
భవిష్యత్తులో అనుసరించాల్సిన అంశాలపై దిశా నిర్ధేశం చేసిన రాహుల్ గాంధీ

Review | ఢిల్లీ, ఆంధ్ర ప్రభ: మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ సీఎం, మంత్రుల సమావేశం ముగిసింది. రెండేళ్ల ప్రభుత్వ పనితీరుపై రెండు గంటలపాటు హై కమాండ్ సమీక్ష జరిపింది. ఆహ్లాదకర వాతావరణంలో సమావేశం జరిగింది. ప్రభుత్వం, పార్టీ పరంగా అన్ని అంశాలను కూలంకషంగా చర్చించాం, భవిష్యత్తులో అనుసరించాల్సిన అంశాలపైన సూచనలు చేసారని మహేష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర మంత్రుల అభిప్రాయాలను పెద్దలు విన్నారు. అన్ని అంశాలపై మాకు దిశా నిర్దేశం చేశారు.

రాజగోపాల్ రెడ్డి అంశం చర్చకు వచ్చిందని, రాజగోపాల్ రెడ్డినీ కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు త్వరలోనే పిలిచి మాట్లాడుతారని పేర్కొన్నారు. అలాగే మంత్రుల గురించి చర్చకు రాలేదని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో 80% ఫలితాల రావడంతో రాష్ట్ర మంత్రి వర్గాన్ని హై కమాండ్ అభినందించింది. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విధివిధానాలను అడిగి తెలుసుకున్నారు, రాజకీయంగా ,ప్రభుత్వ పరంగా అన్ని విషయాలను రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్ర స్థానంలో ఉంది.. మిగతా పంటలను ప్రోత్సహించాలని చెప్పారు.

8 లక్షల కోట్ల రూపాయలు అప్పుపెట్టి వెళ్లారు, కేసీఆర్ లాగా హామీలను ఎగొట్టమని, ఆరు గ్యారంటీలలో మెజారిటీ అమలు చేశాం, ఇంకా మూడేళ్ల సమయం ఉంది. అన్ని అమలు చేసి శభాష్ అనిపించుకుంటామని తెలిపారు. మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఉన్న నిధులలో చాకచక్యంగా పథకాల అమలు చేస్తున్నామని వెల్లడించారు.


మార్చి మొదటి వారంలో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తాం, మార్చి 15 కల్లా పార్టీ పదవులను భర్తీ చేస్తాం, అన్ని గ్యారెంటీలు అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామన్నారు. రాజ్యసభ ఎన్నికలపై రెండు మూడు రోజులలో సీఎం, పీసీసీ చీఫ్ ని పిలిచి మాట్లాడుతామన్నారు.

Leave a Reply