Revenue Office | నష్టపరిహారం అందించాలి

Revenue Office | నష్టపరిహారం అందించాలి

  • త‌హ‌సీల్దార్ ఇక్బాల్ కు వినతిపత్రం ఇచ్చిన కార్పొరేటర్ రవి

Revenue Office | కరీమాబాద్, ఆంధ్రప్రభ : అక్టోబర్ మాసంలో తుఫాన్(storm) కారణంగా విపరీతమైన వర్షాలు కురవడం వలన లోతట్టు ప్రాంతాల్లోని ఇల్లు నీట మునిగి ఇంట్లో నీ ఫర్నిచర్ నిత్యవసర వస్తువులు వరదలో కొట్టుకుపోయిన వారికి ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం అందించాలని 40 వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ‌ డి కె నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కుండెరాజు ఆధ్వర్యంలో ఖిలా వరంగల్ మండల రెవెన్యూ కార్యాలయం(Revenue Office) ముందు జరిగిన ధర్నా కార్యక్రమానికి కార్పొరేటర్ మరుపల్ల రవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

కార్పొరేటర్ మరుపల్ల రవి మాట్లాడుతూ… ఎడతెరపని వర్షాలు కురవడం వలన వివిధ ప్రాంతాల నుండి వచ్చే వరద నీరు లోతట్టు ప్రాంతాలైన డీకే నగర్ కొత్త కుమ్మరి వాడ ఉప్పరోని కుంటలోని కొన్ని ప్రాంతాలు నీట మునగడం, ఇంట్లోని నిత్యవసర వస్తువులు కొట్టుకపోవటం జ‌రిగింద‌న్నారు. తినడానికి తిండిలేక ఆయా కుటుంబ సభ్యులు పునరావాస కేంద్రంలో తలదాచుకున్నారన్నారు.

వరంగల్ జిల్లా పర్యటనకు వరద పరిస్థితులను సమీక్షించడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఇల్లు మునిగిపోయి నష్టపోయిన వారికి ప్రతి ఒక్కరికి రూ.15వేల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపి 45 రోజులు గడుస్తున్నప్పటికీ.. ఏ ఒక్కరికి ఆర్థిక సాయం అందలేదన్నారు.

ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకొని లబ్ధిదారులకు ఆర్థిక సాయం(Financial Assistance) అందజేయాలని, లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామన్నారు. ధర్నాలో పాల్గొన్న వారందరూ వరద బాధితులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఆదుకోవాలని నినాదాలు చేశారు.

ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ కు వినతిపత్రం ఇవ్వగా, తహసీల్దార్ స్పందిస్తూ… వరద బాధితుల వివరాలను ప్రభుత్వానికి పంపామని, త్వరలోనే ఆర్థిక సహాయం అందుతుంద‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కుండే రాజు పసునూరి మల్లేశం, టమ్ టమ్ నరసింహ, మరుపల్ల గౌతం, ఎండి యాకూబ్ పాషా, వేల్పుగొండ నర్సింగరావు, అమీర్ కుంట కుమార్, పాలడుగు నరేష్ రావుల, రవి ఎలుగుల కళ్యాణి, షాహిన్, నాంపల్లి అంజలి, కత్తెర పెళ్లి సరస్వతి, పాలడుగుల లత, చేలుపూరి లక్ష్మి, ఎనబోతుల యాక లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply