నేడు జూబ్లీహిల్స్ లో రేవంత్ ప్రచారం..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మరింత స్పీడు పెంచుతున్నాయి. నువ్వా… నేనా..? అన్నట్టుగా పోటీపడుతున్నారు. అయిఏత.. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ కు సపోర్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 9 వరకు రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. 7 గంటలకు షేక్ పేట్ డివిజన్ హనుమాన్ ఆలయం కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తారు. 8 గంటలకు రెహమత్ నగర్ లో రోడ్ షో ఉంటుంది. ఎస్.పి.ఆర్ హిల్స్ అంబేడ్కర్ విగ్రహం నుంచి హబీబ్ ఫాతిమా నగర్ వరకు రోడ్ షో కొనసాగుతుంది. ఆతర్వాత శ్రీరామ్ నగర్ క్రాస్ రోడ్ వద్ద కార్నర్ మీటింగ్ సీఎం రేవంత్ ప్రసంగిస్తారు.

