కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ కి రేవంత్ రెడ్డి వినతి
న్యూఢిల్లీ-ఆంధ్రప్రభ ప్రతినిధి : గాంధీ సరోవర్ (GandhiSarovar) ప్రాజెక్టుకు 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM RevanthReddy) విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ( RajnathSingh) తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.
మూసీ… ఈసీ నదుల సంగమం సమీపంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ (Gandhi Circle of Unity) నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు రక్షణ శాఖ మంత్రికి సీఎం వివరించారు. జాతీయ సమైక్యత…. గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ (Gandhi Sarovar Project) నిలుస్తుందన్నారు.