బిక్కనూర్, ఆంధ్రప్రభ : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ నాయకులు అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ సీఎంగా గతంలో ఎన్నడు లేని విధంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, సిద్ధిరామేశ్వర ఆలయ పునర్ నిర్మాణ కమిటీ చైర్మన్ లింబాద్రి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు జీవన్ నాయకులు ఉన్నారు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రేవంత్ రెడ్డి

