Returning | నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి

Returning | నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి

Returning | దండేపల్లి, ఆంధ్రప్రభ : 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

ఈ రోజు దండేపల్లి మండలంలోని నెల్కి వెంకటాపూర్, దండేపల్లి, ద్వారక, కొర్విచల్మ, తాళ్లపేట, గ్రామపంచాయతీలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను సందర్శించి రిటర్నింగ్(Returning), సహాయ రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ.. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు చేపట్టిన నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు.

జిల్లాలో 3 విడతలలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా మొదటి విడతలో 90 సర్పంచ్(90 Sarpanch), 816 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియమాలకు లోబడి వ్యవహరించాలని, నామినేషన్ పత్రాల స్వీకరణ(receipt of nomination papers), నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల ప్రకటన, గుర్తుల కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి జాగర్లమూడి ప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply