Reservation | ముందస్తు అరెస్టులు

Reservation | ఓదెల, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలానికి చెందిన బీసీ సంఘం రాష్ట్ర నాయకులను స్థానిక పొత్కపల్లి(Potkapalli) పోలీసులు బుధవారం తెల్లవారుజామున ముందస్తు అరెస్ట్(Arrest) చేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేస్తామంటూ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) మీద బీసీ నాయకులు ఎప్పటికప్పుడు తమ నిరసన గళాలను వినిపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్ పర్యటనను దృష్టిలో ఉంచుకొని పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా బీసీ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి(under control) తీసుకున్నారు.
బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కందుల సదాశివ్(Kandula Sadashiv), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చర్లపల్లి సురేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కందుల అశోక్ పటేల్, యూత్ జనరల్ సెక్రటరీ చర్లపల్లి రాజు గౌడ్ లను పొత్కపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
