వికారాబాద్, మార్చి 22 (ఆంధ్రప్రభ): వికారాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ కళాశాల వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ ను దుర్వాసన వెదజలకుండా ఇతర ప్రాంతానికి తరలించాలని కోరుతూ వికారాబాద్ వాకర్స్ అసోసియేషన్ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.
శనివారం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తస్వర్ అలీ నేతృత్వంలో సభ్యులు సుధాకర్ రెడ్డి, మాధవరెడ్డి, దోమ శ్రీధర్, మాణిక్ ప్రభు, సతీష్, బుచ్చయ్య, రమేష్, తదితరులు పాల్గొన్నారు.