Representatives | చంద్రబాబు – సంజయ్ దత్ భేటీ

Representatives | చంద్రబాబు – సంజయ్ దత్ భేటీ

Representatives | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అమరావతిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు సినీ రంగానికి చెందిన ప్రతినిధులు కూడా హాజరయ్యారు.

ఈ పర్యటన ఇటీవల ముంబైలో మంత్రి నారా లోకేష్‌తో జరిగిన చర్చలకు కొనసాగింపుగా జరిగినట్లు సమాచారం. సంజయ్ దత్‌తో పాటు బాలీవుడ్‌కు చెందిన గౌరవ్ దూబే, కునాల్ పటేల్, అనుజ్ కుమార్ వంటి ప్రముఖులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ భేటీలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో సినీ రంగానికి సంబంధించిన పెట్టుబడులపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సమగ్ర ఫిలిం సిటీ ఏర్పాటు అవసరంపై చర్చ సాగినట్లు సమాచారం. అమరావతి పరిసర ప్రాంతాలు లేదా విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిలిం సిటీ నిర్మాణంపై ప్రతిపాదనలు పరిశీలించినట్లు తెలిసింది.

సినిమా షూటింగ్‌లకు సంబంధించిన అనుమతులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలపై సీఎం చంద్రబాబు వివరాలు తెలియజేసినట్లు సమాచారం. పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

గతంలో ముంబైలో మంత్రి లోకేష్‌ను కలిసిన సందర్భంగా ఏపీ అభివృద్ధిపై ఆయన చూపిన దృష్టిని సంజయ్ దత్ ప్రశంసించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో బాలీవుడ్ పరిశ్రమ ఏపీ వైపు దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని, భవిష్యత్తులో పెద్ద స్థాయి సినీ ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చే సూచనలు ఉన్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Reply