పరిహారం అందేలా నివేదిక…

పరిహారం అందేలా నివేదిక…
దేవరకొండ, ఆంధ్రప్రభ : తుఫాన్‌కు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందేలా చూడాలని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్(Nenavath Balunayak) అన్నారు. ఈ రోజు ఆర్డిఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మొహంతా తుఫానుకు నష్టపోయిన రైతులకు ఇతర లబ్ధిదారులకు నష్టపరిహారం గుర్తించి నివేదిక తయారు చేయాలని బాలు నాయక్ సూచించారు.
వరి పంటలు, పత్తి తీవ్రంగా నష్టపోయిన రైతులను గుర్తించి నివేదిక ద్వారా ప్రభుత్వానికి అందించేలా అధికారులు(officials) చొరవ చూపాలన్నారు. రహదారులు కూడా వర్షాలకు దెబ్బతిన్నాయని అలాంటి వాటిని గుర్తించి మరమత్తులు చేపట్టేలా అధికారులు చొరచూపాలన్నారు. జిల్లాలో దేవరకొండ(Devarakonda) ప్రాంతంలో అత్యధికంగా వర్షపాతం నమోదైనట్లు తమ దృష్టికి వచ్చిందని బాలు నాయక్ అన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి నష్టపోయిన లబ్ధి దారులను గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో రమణారెడ్డి(RDO Ramana Reddy), తాసిల్దార్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
