removal | కొంపల్లి అంగడిసంతలో కంపచెట్ల తొలగింపు

removal | మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలోని అంగడిసంత పరిసర ప్రాంతంలో విపరీతంగా పెరిగిన కంపచెట్లను తొలగించేందుకు నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ శ్రీమతి జీడిమడ్ల నిర్మలదశరథ, ఉప సర్పంచ్ వెదిరె విజేందర్ రెడ్డి నాయకత్వంలో చేపట్టారు.

గ్రామ అభివృద్ధి,పరిశుభ్రతతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ చర్యలు తీసుకున్నామని పాలకవర్గం పేర్కొంది. అంగడిసంత ప్రాంతం శుభ్రంగా మారడం వ్యపారులకు, గ్రామ ప్రజలకు సౌకర్యం కలుగుతుందని తెలిపారు.

removal

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జీడిమడ్ల నరేష్,జాల నర్సింహ, జీడిమడ్ల మౌనిక, సూర శ్రీశైలం, బోయపర్తి ప్రసాద్, సూర సురేష్, గోలి పార్వతి, పంచాయతీ కార్యదర్శి స్వామి, భీముడు మల్లేష్, జీడిమడ్ల దశరథ, దాము నర్సింహ, సంకు శంకర్, జీడిమడ్ల సురేష్, మొగుదాల పెంటయ్య, సూర శంకర్, జూకంటి శ్రీశైలం, మొగుదాల యాదయ్య, జీడిమడ్ల వెంకటయ్య, మొగుదాల శేఖర్, ఎడ్ల ఐలయ్య, జాల రాములు, మాదరగోని చంటి, వీరమల్ల అంజయ్య, అన్యాలపు అలివేలు, ఎడ్ల మహేష్,తిరుగుళ్ళ శ్రీను, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply