సర్కారు ఆసుపత్రికి ఉపశమనం

  • రూ.కోటి ఆధునిక వైద్య పరికరాలు
  • ఏలూరు జనం హ్మాపీ

ఏలూరు, ఆంధ్రప్రభ బ్యూరో : అర కొర సౌకర్యాలు, వైద్య పరికరాల కొరతతో ఇబ్బంది పడుతున్నఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి(To the government public hospital) స్వాంతన చేకూరనుంది. ఎంపీ మహేష్ యాదవ్(MP Mahesh Yadav) చొరవతో రూ.కోటి రూపాయల ‌వైద్య పరికరాలు సమకూరాయి.

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద గెయిల్ ఇండియా(GAIL India) నుంచి కోటి రూపాయల వైద్య పరికరాలు అందాయి. ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన అనస్థీషియా వర్క్ స్టేషన్(Anesthesia Work Station) పరికరాలు, కార్డియోటోమో గ్రఫీ మెషిన్లు, కంప్యూటెడ్ రేడియోగ్రఫీ సిస్టమ్(Computed Radiography System) (ఎక్స్‌రే క్యాసెట్ రీడర్), హెమటాలజీ అనలైజర్ (ఓపెన్ లూప్), హెమటాలజీ అనలైజర్ (ఓపెన్ లూప్), ఐ లైన్డ్ రిఫ్రిజిరేటర్లు కోరుతూ, ఈ ఏడాది మార్చిలో గెయిల్ ఇండియాకు ఆసుపత్రి సూపరింటెండెంట్ పేరుతో లేఖ రాశారు.

సీఎస్ఆర్(CSR) కింద నిధులు కేటాయించి ఈ వైద్య పరికరాలు ఏర్పాటు చేయాల్సిందిగా ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్(MP Mahesh Yadav) కోరడంతో గెయిల్ ఇండియా సానుకూలంగా స్పందించి నిధులు కేటాయించింది. తాజాగా శుక్రవారం రాత్రి వైద్య పరికరాలు(Medical Equipment) ఆసుపత్రికి చేరాయి. కొద్దిరోజుల్లోనే రోగులకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆసుపత్రి వర్గాలు తెలియచేశాయి.

దీనిపై హర్షం వ్యక్తం చేసిన ఎంపీ మహేష్ యాదవ్, ఆసుపత్రి అభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేస్తానని, భవిష్యత్తులో మరిన్నివసతుల కల్పనకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.

Leave a Reply