ఎస్సీ స‌బ్‌ప్లాన్ నిధుల విడుద‌ల‌

ఎస్సీ స‌బ్‌ప్లాన్ నిధుల విడుద‌ల‌

ఉమ్మ‌డి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : ఆదిలాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల కాలనీలలో అభివృద్ధి(Development) పనుల కోసం ఎస్సీ సబ్ ప్లాన్(Sub Plan) కింద రూ. 13.78 కోట్లు విడుదల అయినట్టు ఆదిలాబాద్ ఎమ్మెల్యే(MLA) పాయల్ శంకర్ తెలిపారు.

గత కొన్ని సంవత్సరాల నుంచి ఎస్సీ కాలనీల్లో మురుగు కాలువలు, ఇతర రోడ్ల అభివృద్ధి కోసం పలు గ్రామాల నుంచి వచ్చిన వినతి(Petition) మేరకు నిధుల విడుదలకు ప్రభుత్వాని(Government)కి ప్రతిపాదించగా ఎస్సీ సబ్ ప్లాన్ కింద నిధులు విడుదల‌యినట్టు తెలిపారు. ఇక గ్రామాల అభివృద్ధి పనులకు మార్గం సుగమయిందని ఆయన అన్నారు.

ఇటీవల వరద ముంపుకు గురైన ఎస్సీ కాలనీలు, మౌలిక సమస్యలు అధికంగా ఉన్నప్రాంతాల్లో ఈ నిధులు ఖర్చు చేస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్(Payal Shankar) తెలిపారు.

Leave a Reply