రెండు గేట్లు ఎత్తివేత‌.. నాలుగు వేల క్యూసెక్కుల విడుద‌ల‌

రెండు గేట్లు ఎత్తివేత‌.. నాలుగు వేల క్యూసెక్కుల విడుద‌ల‌

మ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్ర ప్రభ : మెంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో లోయర్ మానేరు జలాశయం ప్రాజెక్టు(Reservoir Project)కు వ‌ర‌ద పోటెత్తింది. ఇన్‌ఫ్లో(Inflow) ఆధారంగా నీరు విడుద‌ల చేస్తున్నారు. జలాశయం నిండడంతో అధికారులు రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రాజెక్టులో ఇప్పటికే పూర్తిస్థాయి 24 టీఏంసీల(24 TNCs) నీరు చేరింది. ప్రాజెక్టుకు వచ్చే నీటి ఇన్‌ఫ్లో ఆధారంగా నీటి విడుదల కొనసాగుతుందని అధికారులు తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Leave a Reply