వరుస వానలతో తగ్గిన ఉత్పత్తి
నిజామాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : దసరా రోజుల్లో కక్కా, ముక్కతోపాటు కల్లు తాగడం కూడా ఆనవాయితీ. నగరాల్లో నిత్యం బిజీగా ఉండే కుర్రకారు పండగ రోజుల్లో తమ సొంతూళ్లకు చేరుకుని ఎంజాయి చేస్తుంటారు. తెలంగాణలో పండగ రోజుల్లో చిన్నాపెద్ద తేడా లేకుండా కల్లు తాగుతూ ఎంజాయి చేయడం అనాదిగా వస్తున్నసంప్రదాయం(Tradition).
అలాగే కొందరు కుటుంబాలతో సహా కల్లు తాగుతుంటారు. నగరాల్లో డిపోలో లభ్యమయ్యే కల్లు కంటే గీత కార్మికులు(Gita workers) అప్పుడే చెట్టు నుంచి దించిన కల్లు శ్రేష్ఠమైనదని, ఆరోగ్యకరమైనదని అందరి నమ్మకం. అయితే ఈ ఏడాది సుమారు నెల రోజులుగా వానలతో ముంచెత్తిన తెలంగాణలో కల్లు(Kallu) ఉత్పత్తి తగ్గిపోయింది. అలాగే గీత కార్మికులు కూడా తమ వృత్తిని చేసుకోవడానికి కూడా అనేక ఆంటకాలు ఉన్నాయి. దీంతో దసరా రోజుల్లో శ్రేష్ఠమైన కల్లు దొరుకునా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంది..
వృత్తికి ఆటంకాలెన్నో?
పండగ పూట కల్లు అమ్మకం ద్వారా నాలుగు డబ్బులు కూడా వేసుకోవాలన్నాగీత కార్మికులపై వర్షాల ప్రభావం తీవ్రంగా పడింది. సుమారు నెల రోజులుగా వానలు, వరదలతో ఉత్తర తెలంగాణ(Telangana) తల్లడిల్లిపోయింది. ఇప్పటికీ వర్షాలు, వరదలు వదల లేదు. ఈ క్రమంలో తాటి, ఈత చెట్ల చుట్టూ బురద, నీరు ఉంది. అలాగే చెట్లు కూడా బాగా తడిసిపోయి చెమ్మపట్టాయి. ఇప్పటికీ ఎండలు లేకపోవడంతో చెట్ల(trees)కు చెమ్మ ఉంది.
దీంతో చెట్టు ఎక్కి కల్లు గీతకు అవకాశం లేకపోయింది. ఎవరైనా సాహించినా ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం లేకపోలేదు. అందుకు గీత కార్మికులు డబ్బులు లేకపోయినా పర్వాలేదు.. ప్రాణాలు ఉంటే చాలు అన్నట్లు గీత కార్మికులు తమ వృత్తికి నెల రోజులుగా స్వస్తి చెప్పారు. దీంతో ప్రస్తుతం(present) కల్లు దొరికే అవకాశం లేదు.
కల్తీ కల్లు పట్ల అప్రమత్తం కావాలి
గ్రామీణ ప్రాంతాల్లో దసరా రోజుల్లో శ్రేష్ఠమైన కల్లు దొరుకుతుందన్న ఆశతో వచ్చిన యువతకు ఈ వర్షాలు ప్రభావంతో నిరాశ ఎదురైంది. అయితే కల్లు ఉత్పత్తి తగ్గిపోవడంతో దీన్ని ఆసరగా చేసుకుని కొందరు వ్యాపారులు కల్తీ కల్లు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు లేకపోలేదు. కల్తీ కల్లు పట్ల కుర్రకారు అప్రమత్తంగా ఉండాలి. సాధారణంగా చెట్టు నుంచి అప్పుడే దించిన కల్లుకు, వ్యాపారులు విక్రయించే కల్లుకు తేడా ఉంటుంది. వ్యాపారులు విక్రయించే కల్లులో రసాయనాలు కలిపే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి కల్లు జోలికి వెళ్లకుండా కుర్రకారులు జాగ్రత్తలు తీసుకోవాలి.