Record’s | విరాట్ కోహ్లీ న‌యా రికార్డులు !

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఛేజింగ్ అంటే పండుగ చేసుకునే విరాట్ కోహ్లీ మరోసారి అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో కేవ‌లం ఛేజింగ్‌ ద్వారానే 8000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించాడు.

కాగా, ఈ ఘనత అందుకున్న రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 8720 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ 8000 + రన్స్‌తో రెండో స్థానంలో నిలిచాడు. ఛేజింగ్‌లో 159 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ 40 శతకాలతో 8000 ప్లస్ రన్స్ చేయడం గమనార్హం.

అయితే, ఈ ఇద్దరికి దరిదాపుల్లో మరే బ్యాటర్‌ లేడు. రోహిత్ శర్మ 6115 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. సనత్ జయసూర్య(5742), జాక్వస్ కల్లీస్(5575) పరుగులతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

నాకౌట్ మ్యాచ్‌లలో 1000

టీమిండియా స్టార్ బ్యాట‌ర్, ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లి మరో రికార్డు సాధించాడు. ఇప్పటి వరకు ఐసిసి నాకౌట్ మ్యాచ్‌లలో 1000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. దుబాయ్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ పోరులో విరాట్ కోహ్లీ ఈ చారిత్రాత్మక ఫీట్ సాధించాడు.

సచిన్ రికార్డ్ బద్దలు..

ఐసీసీ వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ రికార్డ్ సాధించాడు. ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న కోహ్లీ (84) హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే అతను సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను అధిగమించాడు. సచిన్ 23 హాఫ్ సెంచరీలు నమోదు చేయగా.. కోహ్లీ 24 హాఫ్ సెంచరీలు సాధించాడు.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ 18 అర్ధ సెంచరీలతో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉండగా, శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర (17) నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక‌ ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 16 50 ప్లస్ స్కోర్‌లతో ఐదో స్థానంలో ఉన్నాడు.

ICC ODI టోర్నమెంట్లలో అత్యధిక 50-ప్లస్ స్కోర్లు

24 – విరాట్ కోహ్లీ (53 ఇన్నింగ్స్)
23 – సచిన్ టెండూల్కర్ (58 ఇన్నింగ్స్)
18 – రోహిత్ శర్మ (42 ఇన్నింగ్స్)
17 – కుమార సంగక్కర (56 ఇన్నింగ్స్)
16 – రికీ పాంటింగ్ (60 ఇన్నింగ్స్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *