లార్డ్స్ మైదానంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ చెలరేగాడు. తన అద్భుత ప్రదర్శనతో చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా నేడు డే/2 సౌతాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో 6 వికెట్లు (6/28) తీసిన కమ్మిన్స్, టెస్ట్ క్రికెట్లో కెప్టెన్‌గా మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సీజన్లో టాప్ వికెట్ టేకర్స్:
1️⃣ పాట్ కమ్మిన్స్ (ఆస్ట్రేలియా) 78*
2️⃣ జస్ప్రిత్ బుమ్రా (భారతదేశం) 77
3️⃣ మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) 74
4️⃣ నాథన్ లయన్ (ఆస్ట్రేలియా) 66
5️⃣ ఆర్వీ అశ్విన్ (భారతదేశం) 63
ఐసిసి టోర్నమెంట్ ఫైనల్స్‌లో ఒక కెప్టెన్ ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు:
1️⃣ 6/28 – పాట్ కమ్మిన్స్ vs సౌతాఫ్రికా – లార్డ్స్, WTC Final 2025
2️⃣ 3/83 – పాట్ కమ్మిన్స్ vs ఇండియా – ది ఓవల్, WTC Final 2023
3️⃣ 2/6 – డారెన్ సమీ vs శ్రీలంక – కొలంబో, T20 WC Final 2012
టెస్ట్‌ల్లో లార్డ్స్ వేదికగా కెప్టెన్‌గా బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్:
1️⃣ 6/28 – పాట్ కమ్మిన్స్ (ఆస్ట్రేలియా) vs సౌతాఫ్రికా, 2025
2️⃣ 6/101 – బాబ్ విలిస్ (ఇంగ్లాండ్) vs ఇండియా, 1982
3️⃣ 5/35 & 5/42 – గబ్బీ అలెన్ (ఇంగ్లాండ్) vs ఇండియా, 1936
4️⃣ 5/69 – డానియల్ వెట్టోరి (న్యూజిలాండ్) vs ఇంగ్లాండ్, 2008
పాట్ కమ్మిన్స్‌కు 300 టెస్ట్ వికెట్లు – అరుదైన ఘనత
ఈ మ్యాచ్‌లో చివరి వికెట్‌గా కగిసో రబాడాను ఔట్ చేసిన కమ్మిన్స్, తన టెస్ట్ కెరీర్లో 300 వికెట్ల మైలురాయి చేరాడు. దక్షిణాఫ్రికా 121/5 వద్ద ఉన్నప్పుడు, కమ్మిన్స్ మెరుపు స్పెల్‌తో పూర్తిగా కుప్పకూలిపోయింది. చివరకు 138 పరుగులకే ఆలౌట్ అయింది.