ఘనంగా అంజన్నఆలయ పునః నిర్మాణం…

ఘనంగా అంజన్నఆలయ పునః నిర్మాణం…
వైభవంగా హోమం, గణపతి, నవగ్రహాల పూజ…
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లాఊట్కూర్ మండల కేంద్రంలోని పాతపేట శ్రీ ఆంజనేయ స్వామి జీర్ణోదర గర్భగుడి ఆలయ పునః నిర్మాణ పనులు పురోహితులు హరి సర్వోత్తమాచారి ఆధ్వర్యంలో సోమవారం వేదమంత్రోచ్ఛారణ మధ్య ఘనంగా నిర్వహించారు. ఆంజనేయస్వామి గర్భగుడి పునః నిర్మాణ పనుల్లో భాగంగా నవగ్రహ, గణపతి పూజతోపాటు దంపతులతో హోమం నిర్వహించారు. పాతపేట, కుర్వ గేరి పెద్దలు ఆలయ పునః నిర్మాణ పనుల్లో భాగంగా ఆంజనేయ స్వామికి, గోమాతకుప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత పురాతన గర్భగుడిని తొలగించే పనులకుశ్రీకారంచుట్టారు.
పాతపేట,కుర్వగేరి కాలనీలకు చెందిన పలువురు పెద్దలు భక్తులు సమిష్టిగా ఆలయ పునర్నిర్మాణ పనులు చేపడుతున్నారు. గర్భగుడి నిర్మించడంతో పాటు శిఖరం గరుడ స్తంభం ఏర్పాటు పనులుచేపట్టనున్నారు. ఎన్నో ఏళ్ల నాటి దేవాలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభించడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో అధ్యక్షులు ఎం.బాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సూర్యప్రకాశ్ రెడ్డి, ఉప సర్పంచ్ రమేష్,వార్డు సభ్యురాలు సువర్ణరవికుమార్, మాజీ లైన్స్ క్లబ్ అధ్యక్షులు ఎల్కోటి జనార్దన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు గోవిందప్ప, శివరామరాజు, భీమమ్మఆశప్ప కాంట్రాక్టర్ గరిడీ లక్ష్మారెడ్డి, పాతపేట, కుర్వగేరి కాలనీ భక్తులు తదితరులు పాల్గొన్నారు.
