చదువుతోనే సమాజంలో గుర్తింపు..

చదువుతోనే సమాజంలో గుర్తింపు..
కల్వకుర్తి, ఆంధ్ర ప్రభ : కల్వకుర్తి మండలంలోని ఎల్లికల్ గ్రామం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ఈ రోజు కస్తూరి ఫౌండేషన్(Musk Foundation) ఆధ్వర్యంలో మహనీయుల చిత్రపటాలు, నోట్ బుక్స్(Note Books) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కస్తూరి ఫౌండేషన్ సభ్యులు, మాజీ ఎంపీటీసీ కంకణాల నర్సిరెడ్డి(Kankanala Narsireddy) మాట్లాడారు.
సమాజ హితం కోసం కృషి చేసిన మహనీయులను మరువొద్దని అన్నారు. చదువుతోనే సమాజంలో గుర్తింపు, ఉజ్వల భవిష్యత్తు ఉంటాయని నర్సిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అజయ్(Ajay), ఉపాధ్యాయురాలు కవిత, గ్రామ కార్యదర్శి అబిజిత్ రెడ్డి, పాఠశాల మాజీ చైర్మన్ బ్రహ్మం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలీశ్వరయ్య, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు పాలాది శివకృష్ణ(Paladi Sivakrishna), గ్రామ యువకులు పాలాది పరశురాం, పాలాది బాలయ్య. బాలస్వామి. శ్రీను, భీమయ్య, శ్రీశైలం, కిష్టయ్య తదిరులు పాల్గొన్నారు.
