RBI | యథాతథమే..

RBI | యథాతథమే..

RBI | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరి 6, 2026న మానిటరీ పాలసీ కమిటీ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఆటో లోన్లపై వడ్డీ రేట్లు 5.25% వద్దనే కొనసాగుతాయి.

దేశ ఆర్థిక వ్యవస్థ 7.3% వృద్ధి రేటుతో పటిష్టంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య సవాళ్లు, రూపాయి విలువలో హెచ్చుతగ్గులు, బాండ్ మార్కెట్ అస్థిరత వంటి కారణాలతో RBI వేచి చూసే ధోరణిని కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నా, ఆహారేతర వస్తువుల ధరల పెరుగుదలపై నిఘా అవసరమని కమిటీ అభిప్రాయపడింది. లోన్ EMIల భారం తగ్గేందుకు మరికొంత కాలం వేచి చూడాల్సిందేనని ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది.

Leave a Reply