సెంట్రల్ లైటింగ్ పనులు పరిశీలించిన ఈఈ
బిచ్కుంద, నవంబర్ 4( ఆంధ్రప్రభ) : సెంట్రల్ లైటింగ్ పనులను మంగళవారం నాడు ఆర్ అండ్ బి శాఖ ఈఈ మోహన్ (E.E Mohan) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కాంట్రాక్టర్ (contractor) ను సెంట్రల్ లైటింగ్ పనులు తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్తు స్తంభాలు, మిషన్ భగీరథ, ఓ ఎఫ్ సి లైన్ ఉండటంవల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాంట్రాక్టర్ సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డి ఈ వినోద్, ఏఈ భానుచందర్ తదితరులు పాల్గొన్నారు.

