అందెశ్రీ ఉగాది పురస్కారం అందుకున్న రవీందర్

అందెశ్రీ ఉగాది పురస్కారం అందుకున్న రవీందర్

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని జడల్ పేట గ్రామ శివారు భీష్మ నగర్ కాలనీకి చెందిన కవి, రచయిత , చిత్రలేఖన ఆర్టిస్ట్ పుట్టకొక్కుల రవీందర్ అందెశ్రీ పురస్కారం, అందెశ్రీ జ్ఞాపిక అందుకున్నారు. వెన్నెల సాహితి సంగమం ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం సందర్భంగా సిద్దిపేటలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన కవి సమ్మేళనంలో రవీందర్ పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి కవులు, కళాకారులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.

ఈకార్యక్రమంలో వెన్నెల సాహితీ సంఘం ప్రధాన కార్యదర్శి,పర్కపల్లి యాదగిరి ,వెన్నెల సాహితి సంఘం అధ్యక్షులు, వంగర నరసింహారెడ్డి ,కోడం పవన్ కుమార్ చొప్పదండి విద్యాసాగర్ జీడిపల్లిరామచంద్రరావు, వంగగాలిరెడ్డి,కొండిమల్లారెడ్డి,మహమూద్ పాష ,గౌర్రాజు అశోక రాజు ,పిల్లి మహేందర్, పద్మ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply