Ration rice | చౌక ధర దుకాణాలపై తాహసిల్దార్ మెరుపు దాడి

Ration rice | చౌక ధర దుకాణాలపై తాహసిల్దార్ మెరుపు దాడి

  • 100 క్వింటాళ్ల పురుగు పట్టిన బియ్యం గుర్తింపు
  • అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
  • బియ్యాన్ని అమ్ముకుంటున్న లబ్ధిదారుల రేషన్ కార్డు రద్దు చేస్తాం
  • తాసిల్దార్ సైదులు

Ration rice | అచ్చంపేట, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రభలో డిసెంబర్ 5న అక్రమంగా నిలువ చేసిన రేషన్ బియ్యం(Ration rice) స్వాధీనం, కేసు నమోదు పై వచ్చిన వార్త కథనం చర్చ నియాంశమైన సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో అచ్చంపేట తాహసిల్దార్ సైదులు ఈ రోజు అచ్చంపేట మండల వ్యాప్తంగా ఏకకాలంలో తన సిబ్బందితో రేషన్ షాప్‌లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.

తనిఖీల సందర్భంగా రేషన్ షాపుల్లో పురుగు పట్టిన బియ్యం నిల్వ ఉంచి ప్రజలకు పంపిణీ(distribution) చేస్తున్నట్లు గుర్తించడంతో తహసిల్దార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సివిల్ సప్లై అధికారులతో మాట్లాడి ఎందుకు నాసిరకమైన, పురుగు పట్టిన బియ్యాన్ని ప్రజలకు అందించారని నిలదీశారు.

ఈ నేపథ్యంలో అట్టి బియ్యాన్ని వెంటనే వెనక్కి తీసుకుని, నాణ్యమైన సన్నబియ్యం తక్షణమే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేషన్ బియ్యం స్థానిక మార్కెట్లోకి మళ్లించడం, లబ్ధిదారుల నుంచి బియ్యానికి బదులు డబ్బులు చెల్లించడం వంటి అక్రమాలకు పాల్పడిన డీలర్ల(dealers)పై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

అంతేకాదు, ఈ రకమైన అవకతవకల్లో భాగస్వామ్యం చేసిన రేషన్ కార్డు లబ్ధిదారుల రేషన్ కార్డులు(ration cards) కూడా రద్దు అవుతాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా అచ్చంపేట తహసిల్దార్ సైదులు మాట్లాడుతూ.. ప్రజా పంపిణీ వ్యవస్థపై ఎవ్వరూ రాజీ పడకూడదని, ప్రజలకు అందించాల్సిన నాణ్యమైన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు మళ్లించడం, డబ్బులు తీసుకోవడం వంటి చర్యలు కఠినంగా శిక్షార్హం అన్నారు. డీలర్‌ మీద మాత్రమే కాదు, సహకరిస్తున్న లబ్ధిదారులపైనా చర్యలు తీసుకోవడమే కాక వారి రేషన్ కార్డును రద్దు చేయబడుతుందని స్పష్టం చేశారు.

Leave a Reply