Rashiphalalu | నేటి రాశి ఫలాలు 29.05.25

29-5-25

మేషం

అకాల భోజనాదులవల్ల అనారోగ్య మేర్పడుతుంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం అంత మంచిదికాదు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించరాదు.

వృషభం

మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడుపనులకు దూరంగా ఉండుట మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించి విషయాల్లో జాగ్రత్త అవసరం.

మిథునం

గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయ, ప్రయాసలుంటాయి. వృథా ప్రయాణాలెక్కువ చేస్తారు. మానసికాందోళనతో కాలం గడుపాల్సి వస్తుంది. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు.

కర్కాటకం

కళాకారులకు, మీడియారంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు.

సింహం

ప్రయాణాలు ఎక్కువ చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చగుటచే, ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించక తప్పదు.

కన్య

ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. రహస్య శత్రుబాధలుండే అవకాశం ఉంది.

తుల

కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు.

వృశ్చికం

స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశాముంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండడం మంచిది. పరిశ్రుభతకు ప్రాధాన్యమిచ్చినచో అనారోగ్యబాధలుండవు.

ధనస్సు

మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగివుంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులకు గుర్తిస్తారు. శత్రుబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి.

మకరం

విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. మెలకువగా ఉండడం అవసరం. స్థానచలన మేర్పడే అవకాశాలుంటాయి. రుణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్త ఉండాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలుంటాయి.

కుంభం

అపకీర్తి రాకుండా జాగ్రత్తపడడం మంచిది. స్వల్ప అనారోగ్యబాధలుంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండడం ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.

మీనం

ఆర్థిక ఇబ్బందులుండవు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *