Rapthadu | పిల్లల భవిష్యత్తు కోసం..

Rapthadu | పిల్లల భవిష్యత్తు కోసం..

Rapthadu, ఆంధ్రప్రభ : పోలియో రహిత సమాజం కోసం తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని డాక్టర్ శివకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం రాప్తాడు మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లలో పల్స్ పోలియో దినంను నిర్వహించారు. ముందుగా మండల వైద్యాధికారులు శివకృష్ణ శ్రావణి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. అలాగే వైద్య సిబ్బంది కూడా పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.

అనంతరం డాక్టర్లు మాట్లాడుతూ.. మండలంలోని 16 గ్రామ పంచాయతీలోని 27 గ్రామాల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని 3 రోజులు పాటు నిర్వహిస్తున్నాం. మండలం వ్యాప్తంగా 35 పల్స్ పోలియో బూత్ లను 1 బూత్ 44వ జాతీయ రహదారి మరూరు టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేశామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి టోల్ గేట్ మీదుగా ప్రయాణం చేసే ప్రయాణికుల సౌకర్యార్థం పోలియో బూత్ సిద్ధంగా ఉందన్నారు. మండలంలోని వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, వ్యాక్సినేటర్లు, అంగన్వాడీ కార్యకర్తలు మొత్తం 160 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ముగ్గురు రూట్స్ సూపర్వైజర్లు అందుబాటులో ఉన్నారని చెప్పారు. సాయంత్రం 6 గంటల వరకు వైద్య సిబ్బంది పోలియో బూతులు అందుబాటులో ఉంటాయన్నారు.

మొదటిరోజు పోలియో చుక్కలు వేయించుకోవడానికి అందుబాటులో లేని వాళ్ల కోసం 2 రోజుల పాటు వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. పిల్లల భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండాలంటే పోలియో నుండి సంపూర్ణ రక్షణ అవసరమని 0-5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి. ప్రతిసారి రెండు చుక్కలు-పిల్లల ఆరోగ్యానికి సంపూర్ణ రక్షణ అని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రావణి, సిహెచ్ఓ శివప్రసాద్, సూపర్వైజర్లు నరసింహులు, నారాయణస్వామి, ఎంఎల్ హెచ్పీలు అర్చన, మీనలక్ష్మి, చంద్రకళ, ఏఎన్ఎంలు, పుష్ప, నాగలక్ష్మి, ఝాన్సీ, నిరోషా, శారద, రజిని, ప్రమీలమ్మ, ఆశలు విజయలక్ష్మి, నాగవేణి, ఇందిరమ్మ, ఓబులమ్మ, గాయత్రి, చంద్రకళ, శివలక్ష్మి, నాగేంద్రమ్మ, అంగన్వాడీ, టీచర్లు, ఆయాలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply