అత్యాచారం చేసి.. చెట్టుకు కట్టి..
కొల్చారం, ఆంధ్రప్రభ : రోజురోజుకూ మానవత విలువలు దిగజారిపోతున్నాయి. మహిళలు ఒంటరిగా కనిపిస్తే అఘాయిత్యాలకు పాల్పడుతూ అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. మెదక్(Medak) జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులోని ఏడుపాయల వెళ్లే దారిలో ఓ మహిళ నిస్సహాయ స్థితిలో చెట్టుకు కట్టివేసి ఉన్నారు. గాలి అనిల్ కుమార్(Gali Anil Kumar) ఓపెన్ ప్లాట్ వెనకాల చెట్టుకు కట్టేసి ఉన్న ఈ మహిళ దుస్థితిని చూసిన పలువురు పోలీసుల(Police)కు సమాచారం ఇచ్చారు.
వెంటనే మెదక్ డీఎస్పీ, మెదక్ రూరల్ సీఐ వచ్చి బాధితులరాలిని నుంచి వివరాలు సేకరించి మెదక్ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలంలో క్లూస్ టీం(Clues Team) పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్(SI Srinivas Goud), కొల్చారం ఎస్ఐ అహ్మద్ మోహినుద్దీన్(Ahmed Mohinuddin) దర్యాప్తు ప్రారంభించారు. ఆమెపై అత్యాచారం చేసి చెట్టు కట్టేసినట్లు సమాచారం.
