Rangel | గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం

Rangel | గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం

  • ఎంపీడీవో ఆఫీసులో సర్పంచులకు సన్మానం
  • ఎంపీడీవో వారణాసి కమలాకర్

Rangel | రెంజల్, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని, వారికి తమ వంతు సహకారం అందించాలని ఎంపీడీవో వారణాసి కమలాకర్ అన్నారు. ఈ రోజు మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి తహాసిల్దార్ శ్రావణ్ కుమార్, ఎంపీఓ రఫీ అహ్మద్ లతో కలిసి కమలాకర్ మాట్లాడుతూ… గ్రామ అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు.

అందుకు సర్పంచులు కూడా సహకరించాలని, అప్పుడే గ్రామాలు అభివృద్ధి పథంలో నడుస్తాయని స్పష్టం చేశారు. సర్పంచులు గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపి, ఆదర్శవంతమైన మండలంగా తీర్చిదిద్దుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయిలో ఉత్తమ మండలంగా చూస్తారని ధీమా వ్యక్తం చేశారు.

సర్పంచులకు సన్మానం…

మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులకు శాలువా, పూలమాలతో ఎంపీడీవో కమలాకర్, సిబ్బంది సన్మానించారు. లచ్చావార్ సుహాసిని(సాటాపూర్), తిరుపతి లలిత (రెంజల్), తెలంగాణ శంకర్ (తాడ్ బిలోలి), ఖ్యాతం యోగేష్ (నీలా), ధనూర్ నర్సవ్వ(దూపల్లి), రెమ్మ భానుచందర్(కళ్యాపూర్), మల్కు జ్యోతి(బోర్గాం), వాగ్మారే మాధవ్(అంబేద్కర్ నగర్), ధనుంజయ్(దండిగుట్ట),ఎత్తరి మాధవి (వీరన్నగుట్ట), ఆవుల సవిత (బాగేపల్లి), మాలావత్ విజయ్(కిసాన్ తండా), వీరవోయిన మల్లేష్(కూనేపల్లి), జాదో సుమలత(వీరన్నగుట్ట తండా), అశోక్(మౌలాలి తాండ), జుబేర్ పటేల్(పేపర్ మిల్ నీలా), గియాసోద్దీన్(కందకుర్తి) సత్కరించారు. కార్యక్రమంలో పిఆర్ఏఈ వినయ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ అన్వర్, ఏపిఎం మోహన్, ఏపీవో రమణ, టైపిస్ట్ వినాయక, జూనియర్ అసిస్టెంట్ సతీష్, ప్రణవ్ లతోపాటు కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave a Reply