Rambabu | కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి

Rambabu | కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి

  • జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు

Rambabu | రఘునాథపల్లి, ఆంధ్రప్రభ: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థుల విజయంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు అన్నారు. మంగళవారం రఘునాథపల్లి మండలంలోని మేకల గట్టు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ముక్క ఎల్లస్వామిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లింగాల జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కోళ్ల రవి గౌడ్, తాజా మాజీ సర్పంచ్ గడ్డమీది సంధ్యారాణి కిరణ్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply