కుల మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు…

కుల మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు…

రాయపర్తి, ఆంధ్రప్రభ : పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు లో ఆత్మీయత, మతసమరస్యానికి ప్రతీక అని గ్రామ ప్రముఖుడు గుడిబోయిన కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని అలంగిర్ మజీద్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా స్థానిక ఎస్సై ముత్యం రాజేందర్ ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు వడ్డించారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. రంజాన్ ముస్లిం సోదరులకు పవిత్ర మాసం అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు కుల,మత సామ్రాస్యానికి ప్రతికగా నిలుస్తుంది అన్నారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో ముస్లిం సోదరులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉపవాస దీక్షలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సదర్ సాహెబ్ అమ్జద్, నూనె అనిల్, పెండ్యాల గణేష్, వరుణ్ పరకాల నాగరాజు, ఎండి మహమ్మద్,ఎండి అప్రోజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply