Ramadan | మెరుగైన వాతావరణాన్ని కల్పిస్తాం…

Ramadan | మెరుగైన వాతావరణాన్ని కల్పిస్తాం…

Ramadan | పెనమలూరు – ఆంధ్రప్రభ : పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో ముస్లిం మైనార్టీ సోదరులు ఎక్కువగా ఉండే సనత్ నగర్ ప్రాంతంలో మెరుగైన మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేసే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించి పనిచేస్తున్నామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. రంజాన్ పండుగ సమయానికల్లా నూతన నిర్మాణం పూర్తి చేయడం ద్వారా ముస్లిం సోదరులకు పండుగ వాతావరణాన్ని కల్పించేలా ప్రత్యేకదృష్టితో పనిచేస్తున్నామని తెలిపారు.

కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ వర్గాల అభ్యున్నతి, సంక్షేమం అభివృద్ధి పట్ల కూటమి నేతలందరం కలిసి పనిచేస్తున్నామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply