రామ రాజేష్ ఖన్నా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నిక

కరీమాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వరంగల్ జిల్లా రామన్నపేటకు చెందిన రామ రాజేష్ ఖన్నా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి. యూసుఫ్ తెలిపారు.

శివనగర్‌లోని శ్రీరాముల వారి కళ్యాణ మండపంలో నిర్వహించిన తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 4వ మహాసభలో ఈ ఎన్నిక జరిగింది.

ఈ సందర్భంగా రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్న ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి. యూసుఫ్‌కు, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహకు కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పనిచేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్, మెడికల్ కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అయ్యే వరకు కృషి చేస్తానని తెలిపారు.

Leave a Reply