Peddi | డబ్బింగ్ వర్క్ లో చరణ్ బిజీ..

Peddi | డబ్బింగ్ వర్క్ లో చరణ్ బిజీ..

Peddi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ నటిస్తున్న మూవీ పెద్ది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ (Movie) డిజాస్టర్ అవ్వడంతో.. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. చరణ్‌ కూడా పెద్ది సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే.. పెద్ది సినిమా మార్చి 27న రావాలి కానీ.. ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడు ఏప్రిల్ 30న కూడా రావడం డౌటే అంటూ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే.. పెద్ది రావడం పక్కా అంటున్నారు మేకర్స్. మరి.. నిజంగానే పెద్ది ఏప్రిల్ 30న వస్తుందా..? వాయిదా పడనుందా..?

Peddi

Peddi | యూట్యూబ్ సెన్సేషన్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. పెద్ది సినిమా కోసం తనని తాను మార్చుకున్నాడు. ఉత్తరాంధ్ర యాస నేర్చుకుని మరీ చరణ్‌ ఈ సినిమాలో నటిస్తుండడం విశేషం. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో.. స్పోర్ట్స్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో చరణ్‌ కు జంటగా అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటిస్తుండడం ఆసక్తిగా మారింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తే.. యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతుంది. దీంతో పెద్ది సెకండ్ సింగిల్ పై మరింత క్రేజ్ ఏర్పడింది.

Peddi

Peddi | పెద్ది డబ్బింగ్ స్టార్ట్..

పెద్ది సినిమాకి సంబంధించిన డబ్బింగ్ వర్క్ ను చరణ్‌ ప్రారంభించారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియచేశారు. డబ్బింగ్ స్టూడియోలో దర్శకుడు బుచ్చిబాబుతో సరదాగా మాట్లాడుతున్న వీడియోను ఆయన పోస్ట్ చేశారు. ఈ వీడియోలో దర్శకుడిని రామ్ చరణ్ ని (Ram Charan) నవ్విస్తూ కనిపించారు. పెద్ది డబ్బింగ్ స్టార్ట్స్… వాట్ ఈజ్ ఇట్ అంటూ చరణ్ ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే.. డబ్బింగ్ స్టార్ట్ అయ్యింది. ఇక పెద్ది రావడం పక్కా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సో.. పెద్ది ఏప్రిల్ 30న రావడం పక్కా.. మరి.. ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Peddi

Leave a Reply