Ram charan | పెద్ది.. తెర వెనుక ఏం జరుగుతోంది…?
Ram charan | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తోన్న చిత్రం పెద్ది. ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో.. వృద్ది సినిమాస్ బ్యానర్ పై ఈ క్రేజీ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే.. మార్చి 27న పెద్ది చిత్రాన్ని భారీగా రిలీజ్ చేస్తామని ఎప్పుడో ప్రకటించారు. ఇప్పుడు ఈ భారీ చిత్రం వాయిదా పడనుందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇంతకీ.. పెద్ది వాయిదా అనేది నిజమేనా..? అసలు ఏం జరుగుతోంది..?
Ram charan | ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ తో..

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తుండడంతో ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచి అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ ఎక్స్ పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఇక ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన చికిరి సాంగ్ అయితే.. యూట్యూబ్ ని షేక్ చేసింది. రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతూ సినిమా పై మరింత బజ్ క్రియేట్ చేసింది. ఇది ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ తో రూపొందుతోన్న మూవీ. ఈ మూవీ కోసం చరణ్ ఉత్తరాంధ్ర యాస్ నేర్చుకుని మరీ ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు. లుక్, బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తగా ఉండడంతో ఖచ్చితంగా ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తాడని మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Ram charan | సంక్రాంతికి పెద్ది సాంగ్..

ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఒక పాట మాత్రమే రిలీజ్ చేశారు. మరి.. రెండో పాటను కొత్త సంవత్సరం కానుకగా 1న రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. 1న రిలీజ్ చేయడం కంటే.. సంక్రాంతికి రిలీజ్ చేస్తే.. బెటర్ అనే ఉద్దేశ్యంతో ప్లాన్ మారిందని తెలిసింది. సంక్రాంతికి పెద్ది నుంచి సాంగ్ రావడం ఖాయమని తెలిసింది. ఈసారి చరణ్, జాన్వీల పై చిత్రీకరించిన డ్యూయట్ ను రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఈ సినిమాకి సంగీత సంచలనం ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. చికిరి సాంగ్ చార్ట్ బస్టర్ అవ్వడంతో.. రెండో సాంగ్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని.. రిలీజ్ చేసిన వెంటనే చార్ట్ బస్టర్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్.
Ram charan | పెద్ది రావడం పక్కా..

ఇక అసలు విషయానికి వస్తే.. పెద్ది సినిమా మార్చి 27న రిలీజ్ అని ఎప్పుడో ప్రకటించారు. అయితే.. ఇప్పుడు పెద్ది రావడం లేదు.. పోస్ట్ పోన్ అవ్వడం ఖాయమని.. గట్టిగా టాక్ వినిపిస్తోంది. కారణం ఏంటంటే.. జనవరి వచ్చేసింది కానీ.. షూటింగ్ కంప్లీట్ కాలేదు. ఈ నెలాఖరు వరకు షూటింగ్ ఉంటుందని చెబుతున్నారు కానీ.. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు షూటింగ్ ఉండే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. ఆతర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయాలి.. మరో వైపు ప్రమోషన్ చేయాలి అంటే టైమ్ సరిపోదు. అందుచేత హడావిడిగా రిలీజ్ చేయడం కంటే.. పోస్ట్ పోన్ చేయడం బెటర్ అని ఆలోచిస్తున్నట్టుగా ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. అయితే.. మేకర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 27నే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. అందుచేత పోస్ట్ పోన్ లేదు పెద్ది రావడం ఖాయమనే మాట కూడా వినిపిస్తోంది. మరి.. పెద్ది మేకర్స్ త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

CLICK HERE TO READ దాని కంటే.. మెగాస్టార్ వంద రెట్లు అదరగొట్టారు..

