Rally | గ్రామీణ క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం…

Rally | బిక్కనూర్, ఆంధ్రప్రభ : గ్రామీణ క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మండల అభివృద్ధి అధికారి రాజ్ కిరణ్ రెడ్డి చెప్పారు. ఇవాళ‌ మండల కేంద్రంలో సీఎం కప్ క్రీడలపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల ప్రతిభను బయటకు తీసేందుకు ఈనెల 17 నుండి సీఎం కప్ క్రీడలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ఈ రంగంలో రాణించాలనుకున్నవారు అదే రంగంలో ముందుకు పోవాలని చెప్పారు. మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో పలు రకాల క్రీడా పోటీలను ప్రభుత్వపరంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్ని గ్రామాల్లో ఉన్న క్రీడాకారులు క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ఉపసర్పంచ్ దుంపల మోహన్ రెడ్డి, పట్టణ, గ్రామ సచివాలయ కార్యనిర్వాహక అధికారి మహేష్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమ్ రెడ్డి, సిద్ధిరామేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షులు లింబాద్రి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్, పలువురు వార్డు సభ్యులు నాయకులు యువకులు పాల్గొన్నారు.

Leave a Reply