Rajini | అంబేద్కర్ అడుగుజాడల్లో..
Rajini | ఘంటసాల, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ (Dr. B.R. Ambedkar) వర్ధంతి కార్యక్రమాన్ని ఘంటసాల మండల పరిధిలోని ఘంటసాల పాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పెద్ద దళిత వాడ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సర్పంచ్ దోనే రజిని పూలమాల వేసి నివాళులర్పించారు. అదే విధంగా చిన్న దళిత వాడ వద్ద ఉన్న భారీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి జోహార్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని ఈ సందర్భంగా సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు దోనె వెంకటేశ్వరరావు, గ్రామస్తులు గొరుముచ్చు సురేష్, యన్నం శ్రీనివాసరావు, గొరుముచ్చు పాపారావు, చిర్ల పండు, గొరుముచ్చు వెంకటేశ్వరరావు, గొరుముచ్చు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

