Rajampet | భార్య ఆత్మహత్య చేసుకుంటుండగా.. భర్త..

Rajampet | భార్య ఆత్మహత్య చేసుకుంటుండగా.. భర్త..
Rajampet | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా రాజంపేటలో దారుణం చోటుచేసుకుంది. రైల్వే లోకో పైలట్‌గా పనిచేస్తున్న శ్రీరామ్ శ్రీనివాస్ భార్య కృష్ణవేణి కుటుంబ గొడవల కారణంగా ఉరివేసుకున్నారు.
అయితే ఘటన సమయంలో భర్త అక్కడే ఉన్నప్పటికీ, కృష్ణవేణిని ఆపకపోగా.. ఉరి అలా కాదు, ఇలా వేసుకోవాలి అని సూచిస్తూ వీడియో తీసుకున్నాడు. శ్రీనివాసులు, కృష్ణవేణి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. అయితే భార్య గది తలుపులు వేసుకొని ఉరి వేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకుంటుండగా భర్త కిటికీలో నుంచి వీడియో తీశాడు. దీంతో కృష్ణవేణి మృతిచెందగా, ఆమె బంధువులు ఆగ్రహావేశాలకు లోనై శ్రీరామ్‌పై దాడికి ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులు శ్రీరామ్‌ని అదుపులోకి తీసుకున్న విచారణ చేపట్టారు.
