రైతు సోదరులు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి

రైతు సోదరులు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి
పరకాల, ఆంధ్రప్రభ : రైతు పెట్టుబడి సహాయం , తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా యాసంగి 2025-26 కొరకు కొత్తగా పట్టాదారు పాసుబుక్ వచ్చిన రైతులు, రైతు భరోసా దరఖాస్తు చేసుకోవాలని పరకాల మండల వ్యవసాయ అధికారి సోమరాతి శ్రీనివాస్ తెలిపారు. ఫిబ్రవరి 28 వరకు పట్టాదార్ పాస్ బుక్ వచ్చినవారు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారినీ కలిసి దరఖాస్తు చేసుకోగలరు.
చివరి తేదీ 25 మార్చి 2026, రైతు సోదరులు రైతు భరోసా కొరకు దరఖాస్తు చేసుకోవాలని, రైతు భరోసా దరఖాస్తు కొరకు కావలసిన పత్రాలు, పట్టాదారు పాసు బుక్ నకలు కాపీ, ఆధార్ కార్డు నకలు, బ్యాంకు అకౌంట్ ,పాస్బుక్ మొదటి పేజీ లేదా క్యాన్సల్ చేయబడిన చెక్కు మరియు మొబైల్ నెంబరు సమర్పించవలసి ఉంటుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబడు రైతు మహోత్సవం, 19 మార్చి నుండి 22 మార్చి 2026 వరకు సిద్దిపేట జిల్లా,నర్మెట్ట మండలం ,నర్మెట్ట గ్రామం నందు నిర్వహించబడును , ఈ కార్యక్రమంలో ఆధునిక వ్యవసాయం, డ్రోన్స్ సాంకేతికత, ప్రకృతి వ్యవసాయం, ఆయిల్ ఫాం సాగు, వివిధ వ్యవసాయ ఆవిష్కరణలు ప్రదర్శించబడతాయి, రైతులు శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం, రైతు సోదరులు ప్రతి గ్రామం నుండి ఈ కార్యక్రమానికి రావలసిందిగా కోరుచున్నామని, పరకాల మండలం నుండి 19 మార్చ్, 21 మార్చి 2026, వ్యవసాయ మార్కెట్ నుండి బస్సు ఏర్పాటు చేయడమైనది,22 మార్చ్ నాడు ప్రతి రైతు వేదిక క్లస్టర్ నుండి బస్సు సదుపాయం కలదు కావున రైతు సోదరులు ఈ మహోత్సవానికి పెద్ద మొత్తంలో హాజరు కాగలరని పరకాల మండల వ్యవసాయ అధికారి సోమరాతి శ్రీనివాస్ కోరారు.
