రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మార్చి 23న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాదాపు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్ (హై ఇంటెన్సిటీ) జారీ చేసింది వాతావరణ శాఖ.
నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రాజన్న సిగరెడ్డాల్, జగిత్యాల జిల్లాల్లో మెరుపులు, 30-40 కి.మీ తో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.