వికారాబాద్, జులై 23 ( ఆంధ్రప్రభ): రైల్వే బ్రిడ్జి (Railway bridge) కింద బురద-ప్రయాణం సాగేదెలా అని ప్రయాణికులు (Passengers), వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. వికారాబాద్ మండల పరిధిలోని గోదాంగూడ (godamguda) రైల్వే అండర్ బ్రిడ్జి కింద వర్షానికి బురద వచ్చి చేరింది.
దీంతో సర్పంపల్లి, ద్యాచారం, అంతారం, మొమిన్ కలన్, గొట్టిముక్కల ఆయా గ్రామాల ప్రజలు వికారాబాద్ రావాలంటే అదే మార్గం నుండి రావాల్సి ఉంది. గతంలోనూ బ్రిడ్జి కింద గుంతలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగేది. ప్రస్తుతం వరదతో బురద చేరడంతో వాహన దారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించాలని ప్రజలు, వాహన దారులు కోరుతున్నారు.