Railway Police | రైలు ప్రమాదంలో.. ఒక‌రు మృతి

Railway Police | రైలు ప్రమాదంలో.. ఒక‌రు మృతి

Railway Police | ఏలూరు, ఆంధ్ర‌ప్ర‌భ : రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి ఇవాళ‌ ఉదయం మృతిచెందాడు. ఏలూరు సత్రంపాడు ఐటిఐ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద ఈ ఘటన జరిగినట్లు రైల్వే పోలీసులు సమాచారం అందుకున్నారు. మృతుడి వద్ద ఎటువంటి వివరాలు లభించలేదు. అతను 30 నుండి 35ఏళ్ల‌ మధ్య వయసు కలిగి ఉంటాడని, బ్లాక్ ప్యాంటు, గళ్ళ షర్టు ధరించి ఉన్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే హెచ్ సి పి శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply