కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి కొంత ఊరట లభించింది. వినాయక్ దామోదర్ సావర్కర్‌ను ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దాఖలైన కేసులో మహారాష్ట్ర నాసిక్ కోర్టు తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసును సావర్కర్ ముని మనవడు సత్యకీర్ సావర్కర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మార్చి 2023లో లండన్‌లో రాహుల్ చేసిన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలే దీనికి కారణమయ్యాయి.
అంతకుముందు, ఇదే తరహా ఫిర్యాదుపై పూణే కోర్టు కూడా రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఇలా పునరావృతం కాకుండా రాహుల్ తన ప్రజా ప్రసంగాలలో మరింత జాగ్రత్త వహించాలని కోర్టు హెచ్చరించింది.