Raging | పెట్రేగిపోతున్న ర్యాగింగ్ భూతం

Raging | పెట్రేగిపోతున్న ర్యాగింగ్ భూతం

  • సంగారెడ్డి మెడికల్ కళాశాలలో సీనియర్ల పైశాషికం
  • జూనియర్ పై ర్యాగింగ్ తో వేధింపులు
  • హద్దులు దాటుతున్న మానసిక ఆనందం
  • వైద్య – ఆరోగ్య మంత్రి దామోదర ఇలాకాలో ఘటన
  • అవగాహన కల్పించడంలో పోలీసులు విఫలం
  • ఘటన వెలుగులోకి రాకుండా రిక్వెస్టులు

ఆంధ్రప్రభ, ఉమ్మడి మెదక్ బ్యూరో : వారు భవిష్యత్ లో కాబోయే వైద్యులు. రోగులకు చికిత్స అందించి ప్రాణాలు పోయాల్సిన వారు. వైద్య డిగ్రీ (ఎంబీబీఎస్) పట్టా పొందే క్రమంలో ప్రాథమికంగా మానసిక స్థితి(state of mind) దృఢంగా, సంకల్ప బలం, పరోపకారం, కృతనిశ్చయం, స్థిత ప్రజ్ఞతో ఉంటేనే డిగ్రీ పాస్ అవుట్ అయ్యి పీజీ, స్పెషలైజేషన్ కోర్సులు, ఉన్నత విద్యలు అభ్యసించి భావితరాలకు వైద్య సేవలు(Medical services for future generations) అందించే అవకాశం లభిస్తుంది.

కానీ కొంత మంది పాస్ అవుట్ కాక ముందే క్షణికానందం కోసం ర్యాగింగ్ చేస్తూ చట్టాన్ని అతిక్రమిస్తున్నారు. ఫలితంగా కేసుల్లో చిక్కుకుని తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలపై నీళ్లు(Water on hope) చల్లుతున్నారు. మరోవైపు బంగారు భవిష్యత్ కోసం బాటలు వేసుకుందామని క్యాంపస్ లో అడుగుపెట్టిపెట్టగానే ర్యాగింగ్ భూతానికి చిక్కుకుని బలిపశువులుగా మారుతున్నారు. ఇలాంటి ఘటనలు ప్రొఫెసర్ల దృష్టికి వచ్చినా శిక్షించాల్సింది పోయి నిమ్మకుండిపోతున్నారు. ఫలితంగా సీనియర్లు జూనియర్లతో(Seniors with juniors) ర్యాగింగ్ అనే వంకతో రెచ్చిపోతుండగా జూనియర్లు బలవుతున్నారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు..

ఉమ్మడి మెదక్ బ్యూరో, ఆంధ్రప్రభ : చదువులమ్మ తల్లి ఒడిలో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన మెడికల్ విద్యార్థులు మానసిక ఆనందం కోసం ర్యాగింగ్ కు పాల్పడుతూ వారి భవిష్యత్ ను అంధ‌కారమయం(The future is dark.) చేసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రెండవ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులు కొంత మంది మొదటి సంవత్సరం విద్యార్ధి పై ర్యాగింగ్ కు పాల్పడ్డారు. సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదని జూనియర్ విద్యార్ధి పై వేధింపులు(Harassment of students) మొదలుపెట్టారు. అయితే ఈ విషయం విద్యార్థి కుటుంబానికి తెలియడంతో బాధిత విద్యార్థి సోదరుడు కళాశాలకు వచ్చి ప్రశ్నించి ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. ఈ విషయం ఇలా ఉండగానే సీనియర్లు జూనియర్ విద్యార్థి ఇంటికెళ్లి ఎందుకు ఫిర్యాదు చేశారని నిలదీశారు. ఆందోళన చెందిన బాధిత విద్యార్థి కుటుంబం పోలీసులను ఆశ్రయించారు.

వైద్య-ఆరోగ్య కుటుంబ శాఖ మంత్రి ఇలాకాలో ర్యాగింగ్ భూతం..
రాష్ట్ర వైద్య – ఆరోగ్య అండ్ కుటుంబ శాఖ మంత్రిగా బాధ్యతలు వహిస్తున్న దామోదర రాజనర్సిహ్మ ఇలాఖాలో ర్యాగింగ్ ఘటన చోటు చేసుకోవడం ఆశ్యర్యానికి గురిచేస్తుందని ప్రతిపక్షాలు గళమెత్తుతున్నాయి. సీనియర్లు జూనియర్లకు ఆదర్శంగా ఉండాల్సి ఉండగా, ర్యాగింగ్ తో మానసిక క్షోభ(Mental distress)కు గురిచేయడం తగదని సర్వత్రా హితవు పలుకుతున్నారు. ర్యాగింగ్ కారణంగా భవిష్యత్ నాశనమ‌య్యే అవకాశం ఉందని బాధితులు ఒక్కోసారి మానసికంగా కృంగిపోయి భవిష్యత్ పై ఆశలు వదులుకుంటారని, ఇలాంటి ఘటనలు పునరావృతం(Repetition) కాకుండా తల్లిదండ్రులతో పాటు కళాశాల ప్రొఫెసర్లు, పోలీసులు అవగాహన కల్పించాలని స్పష్టం చేస్తున్నారు. ర్యాగింగ్ ఎట్టి పరిస్థితుల్లో శ్రుతి మించకూడదని సీనియర్లు జూనియర్లపై స్నేహపూర్వక వాతావరణంలొనే మెదలాలని సూచిస్తున్నారు.

ర్యాగింగ్ చేయడంతో పాటు బాధిత విద్యార్థి ఇంటిపైకెళ్లిన సీనియర్లు..
సంగారెడ్డి మెడికల్ కళాశాలలో విద్యానభ్యసిస్తున్న మొదటి సంవత్సరం విద్యార్థి పై ర్యాగింగ్ కు పాల్పడ్డ సీనియర్ వ్యవహారం విమర్శలకు(to criticism) దారితీస్తుంది. ర్యాగింగ్ చేయడంతో పాటు బాధిత విద్యార్థి సోదరుడు వచ్చి ప్రశ్నించినందుకు ఆగ్రహించిన సుమారు యాభై మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు శాంతినగర్‌లోని బాధిత విద్యార్థి ఇంటిపై దాడికి యత్నించినట్లు(Like an attempted attack) తెలిసింది. ఈ సందర్భంగా అడ్డుకునే ప్రయత్నం చేసిన విద్యార్థి తండ్రి పైకూడా దాడికి ప్రయత్నించినట్లు సమాచారం.

అవగాహన కల్పించడంలో విఫలం..
ప్రతి సంవత్సరం ఒరియంటేషన్ డే సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ర్యాగింగ్ పై కళాశాల ఫ్రొఫెసర్లు ఎందుకు అవగాహన కల్పించడం లేదని బాధిత తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అవగాహన కల్పించినా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే బాధితుల పక్షాన(On behalf of the victims) ఎందుకు నిలబడటం లేదన్న ప్రశ్న ఉత్పన్నమ‌వుతుంది. ఒక వేళ తెలిసినా కళాశాల ప్రిన్సిపాల్, ఫ్రొఫెసర్లు మౌనం ప్రదర్శిస్తున్నారా అంటూ బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ర్యాగింగ్ విషయంలో ఖచ్చితంగా కళాశాల తరుపున పోలీసు శాఖతో చట్టాలపై అవగాహాన కల్పిస్తే ర్యాగింగ్ భూతానికి చెక్ పెట్టిన వారిమౌతామని సర్వత్రా డిమాండ్(Demand everywhere) చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒరియంటేషన్ డే, ఇతర కార్యక్రమాల్లో తప్పకుండా ర్యాగింగ్ అంశంపై అవగాహాన కల్పించి కఠిన చర్యలుంటాయని అన్నివర్గాల విద్యార్థులకు హెచ్చరికలు జారీ చేయాలని స్పష్టం చేస్తున్నారు. ఇకనైనా సంగారెడ్డి మెడికల్ కళాశాలలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కోరుకుందాం.. ఆ దిశగా కళాశాల ప్రిన్సిపాల్, ఫ్రొఫెసర్లు, పోలీసులు చర్యలు చేపడుతారని ఆశిద్దాం..

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీయకుంటాం…
రాము నాయుడు, టౌన్ సీఐ
మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ విషయమై మా దృష్టికి వచ్చింది. ఇప్పటి వరకు లిఖిత పూర్వకంగా ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. ప్రాథమిక సమాచారం మేరకు విచారణ జరుపుతున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడమే కాకుండా అవగాహన కలిగిస్తాం.

Leave a Reply