Radha saptami | 25న సప్త వాహన సేవ..

Radha saptami | 25న సప్త వాహన సేవ..
Radha saptami | వికారాబాద్, ఆంధ్రప్రభ : రథసప్తమి సందర్భంగా ఈ నెల 25వ తేదీ ఆదివారం అనంతగిరి శ్రీ అనంత పద్మశాలి దేవాలయంలో రథసప్తమి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ట్రస్ట్ పద్మనాభం కార్యనిర్వణ అధికారి నరేందర్ తెలిపారు. మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ అనంత పద్మనాభ స్వామిని ఉదయం ఏడున్నర గంటలకు సూర్య ప్రభ వాహనం పై ఊరేగిస్తామని 9 గంటలకు హనుమంత వాహనం పై ఊరేగించడం జరుగుతుందని 10 గంటలకు ముత్యాల పందిరి వాహనం పై ఊరేగిస్తామని 11 గంటలకు గరుడవాహనం పై ఊరేగిస్తామని తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటలకు గజ వాహనం పై ఊరేగింపు ఉంటుందని నాలుగు గంటలకు సింహవాహానం పై ఊరేగిస్తామని 5 గంటలకు చంద్రప్రభ వాహనం పై శ్రీ అనంతపద్మనాభ స్వామిని ఊరేగిస్తామని తెలిపారు.
