Rachapalli | ఆ ఒక్కటీ ఏకగ్రీవం..

Rachapalli | ఆ ఒక్కటీ ఏకగ్రీవం..
Rachapalli, చెన్నూర్ ఆంధ్రప్రభ : మూడోవిడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఉపసహరణ ముగిసింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో మొత్తం 30 గ్రామపంచాయతీలకు గాను సర్పంచ్ స్థానాలకు 175 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా రచ్చపల్లి గ్రామపంచాయతీ బీసి మహిళ అభ్యర్థి గెల్లు లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎంపీడీఓ మోహన్ తెలిపారు.
ఉపసహరణ సమయం ముగిసే వరకు 59 మంది అభ్యర్థులు తమ నామినేషనలను ఉపాసంహరించుకోవడంతో 29 గ్రామపంచాయతీ లకు గాను 115 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎంపీడీఓ పేర్కొన్నారు. 30 గ్రామపంచాయతీలలో మొత్తం 244 వార్డుసభ్యుల స్థానాలకుగాను 566నామినేషన్లు దాఖాలు కాగా 45 ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన 199 వార్డులకు గాను 513 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎంపీడీఓ తెలిపారు.
