క్యూ మీడియా సంచ‌ల‌న స‌ర్వే..

హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడెక్కిస్తోంది. రాష్ట్రంలో మూడు ప్ర‌ధాన పార్టీలు త‌మ త‌మ రేసు గుర్రాల‌ను బరిలోకి దించాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాలైన బీఆర్‌ఎస్, బీజేపీ ఈ స్థానాన్ని గెలుచుకోవడానికి తీవ్రంగా పోటీ పడుతున్నాయి.

అధికార పార్టీగా తమ ప్రజా పాలనకు ఈ గెలుపు మరింత బలాన్ని చేకూరుస్తుందని కాంగ్రెస్ భావిస్తుండ‌గా… గ్రేటర్ హైదరాబాద్‌పై తమ పట్టు ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకోవాలని, తమ పూర్వ వైభవాన్ని చాటుకోవాలని బీఆర్ఎస్ చూస్తోంది. మ‌రోవైపు రాష్ట్రంలో తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకోవడానికి, వ్యూహాత్మక విజయంతో బీజేపీ ఈ స్థానంపై పట్టు సాధించాలని ప్రయత్నిస్తోంది.

ఈ ఉప ఎన్నికలో విజయం సాధించి తమ తమ రాజకీయ స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని ఈ పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో, ఎన్నికల ఫలితాలపై ప్రజల నాడిని తెలుసుకునేందుకు అనేక సర్వేలు ఊపందుకున్నాయి. ఈ సర్వేల్లో ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి, ప్రజల్లో ఏ పార్టీపై ఎలాంటి అభిప్రాయం ఉంది అనే అంశాలపై విశ్లేషణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా, ప్రముఖ సంస్థ క్యూ మెగా సర్వే సంస్థ తొలిసారిగా… ఆంధ్రప్రభతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొని తమ సర్వే ఫలితాలను వెల్లడించింది.

క్యూ మెగా సర్వే ఫలితాలు, జూబ్లీహిల్స్ గెలుపు ఏ పార్టీది అనే పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి పూర్తి వీడియోను చూడండి…

Leave a Reply